గాడిద పాలతో నెలకు 3 లక్షలు
‘చదువు రాకపోతే గాడిదలు కాయ్.. కనీసం అవి బరువులైనా మోస్తయ్. నువ్వూ ఉన్నావ్ ఎందుకు?’ అంటూ గాడిదతో పోల్చుతూ తిడుతుంటారు. కానీ, ఆ గాడిదలతోనే నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్‌కు చెందిన ధీరేణ్ సోలంకీ.
- గుజరాత్ యువకుడి సంపాదన
అహ్మదాబాద్, ఏప్రిల్ 21: ‘చదువు రాకపోతే గాడిదలు కాయ్.. కనీసం అవి బరువులైనా మోస్తయ్. నువ్వూ ఉన్నావ్ ఎందుకు?’ అంటూ గాడిదతో పోల్చుతూ తిడుతుంటారు. కానీ, ఆ గాడిదలతోనే నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నాడు గుజరాత్‌కు చెందిన ధీరేణ్ సోలంకీ. వివరాల్లోకెళితే.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన ధీరేణ్.. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినా పెద్దగా లాభం లేకపోయింది. ఏదైనా బిజినెస్ పెడదామని ఆలోచించగా, దక్షిణ భారతదేశంలో గాడిదల పెంపకానికి ఆదరణ పెరుగుతున్నదని తెలుసుకున్నాడు. సమాచారం సేకరించి.. ఆర్నెళ్ల కిందట 20 గాడిదలను కొని సొంత ఊరిలోనే ఫామ్ ప్రారంభించాడు. దానికోసం రూ.22 లక్షలు పెట్టుబడి అయ్యింది. ప్రస్తుతం అతడి వద్ద 42 గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు ఇచ్చే పాలను దక్షిణ భారత్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నాడు. ‘ఫామ్ పెట్టిన ప్రారంభంలో గిరాకీ లేదు. దక్షిణ భారత్‌లో డిమాండ్ ఉన్నదని తెలుసుకొని అక్కడి కస్టమర్లను సంప్రదించా. కర్ణాటక, కేరళకు పాలను సరఫరా చేస్తున్నా. సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు నా వద్ద పాలను కొంటున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని విక్రయిస్తున్నా. ప్రభుత్వం ఈ రంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది’ అని వివరించాడు. ఒక లీటరుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధర ఉన్నదని వెల్లడించాడు.
గాడిద పాలతో లాభాలు:
కోరింత దగ్గు, ఆస్తమా, వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు తగ్గేందుకు గాడిద పాలను ఔషధంగా వాడుతారు. ఈ పాలను ఫెయిర్‌నెస్ క్రీములు, షాంపూలు, లిప్ బామ్, బాడీ వాష్‌ల తయారీలో వాడతారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

