వేరుశనగ ఎగుమతులకు ప్రోత్సాహం…

ఢిల్లీ,జూన్ 8: తూర్పు ప్రాంతం నుంచి వేరుశనగ ఎగుమతిని పెంచే అవకాశాలకు ఊతమిస్తూ, పశ్చిమ బంగాల్ నుంచి నేపాల్‌కు 24 మెట్రిక్ టన్నుల వేరుశనగను ఎగుమతి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా రైతుల నుంచి సేకరించిన పంటను అపెడా, కోల్‌కతాలోని లాదురమ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎగుమతి చేసింది. సాధారణంగా వేరుశనగ ఎగుమతిలో గుజరాత్, రాజస్థాన్‌దే ప్రధాన భాగం. పశ్చిమ బంగాల్ నుంచి ఎగుమతులు, తూర్పు ప్రాంతం నుంచి పంట ఎగుమతులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు.
2020-21లో, రూ.5381 కోట్ల విలువైన 6.38 లక్షటన్నుల వేరుశనగ దిగుబడి వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మన దేశం నుంచి ఎక్కువగా ఇండోనేషియా, వియత్నం, ఫిలిప్పిన్స్, మలేసియా, థాయిలాండ్, చైనా, రష్యా, ఉక్రెయిన్, యూఏఈ, నేపాల్‌కు వేరుశనగ ఎగుమతి అవుతుంది. “పీనట్.నెట్” వంటి వేదికల ద్వారా; కొనుగోలుదారుల నమోదు, అపెడా నమోదిత వేరుశనగ యూనిట్ల ద్వారా బ్యాచ్ ప్రాసెసింగ్, ఎగుమతి పత్రం కోసం దరఖాస్తు, ఎగుమతిదారు నుంచి స్టఫింగ్ సర్టిఫికెట్, అఫ్లాటాక్సిన్ విశ్లేషణ, ప్రయోగశాలల నుంచి స్టఫింగ్ సర్టిఫికెట్ జారీ, అపెడా ద్వారా ఎగుమతి ధృవీకరణ పత్రం జారీ వంటి చర్యల ద్వారా వేరుశనగ ఎగుమతులను అపెడా క్రమబద్ధీకరిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

