Viral News | చీపురులో పోషక విలువలు..! నవ్వకండి.. సీరియస్ మ్యాటర్
Viral News | మనం ఏదైనా తినుబండారాల వస్తువులను కొన్నప్పుడు దానిమీద ఉన్నట్టుగానే క్యాలరీలు ఎన్ని..? చెక్కర ఎంత..? ఫ్యాట్ కంటెంట్ ఎంత..? కార్బొహైడ్రేట్స్ ఎన్ని..? వంటి వివరాలను చీపురు కట్టపైనా కూలంకశంగా ముద్రించడం గమనార్హం.
Viral News | ఇల్లు, వీధులలో ఉన్న చెత్తను ఊడ్చటానికి వినియోగించే చీపురు అంటే అందరికీ చిన్నచూపే. దానితో అవసరం తీరాక చీపురును తీసుకెళ్లి ఎక్కడో ఇంటి మూలన ఏ దిక్కూదివానం లేకుండా పడేస్తుంటారు కదా. కానీ చీపురులో కూడా పోషక విలువలు ఉన్నాయట. యూఎస్ కంపెనీ ఒరెగాన్ తయారు చేస్తున్న చీపురు కట్టపై ఉన్న కవర్లో న్యూట్రిషన్స్కు సంబంధించిన పెద్ద జాబితానే ఉంది. మనం ఏదైనా తినుబండారాల వస్తువులను కొన్నప్పుడు దానిమీద ఉన్నట్టుగానే క్యాలరీలు ఎన్ని..? చెక్కర ఎంత..? ఫ్యాట్ కంటెంట్ ఎంత..? కార్బొహైడ్రేట్స్ ఎన్ని..? వంటి వివరాలను చీపురు కట్టపైనా కూలంకశంగా ముద్రించడం గమనార్హం.
చీపురు కట్ట కవర్ వెనుకాల న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని రాసి ఉన్న కాలమ్లో.. పది గ్రాములకు మొత్తం కొవ్వు నిల్వలు 13 శాతం, సోడియం 7 శాతం, మొత్తం కార్బొహైడ్రేట్స్ 6 శాతం, ఐరన్ 2 శాతం ఉన్నట్టు ముద్రించడం గమనార్హం. ఈ చీపురులో విటమిన్, కాల్సియం, పొటాషియం, షుగర్స్ వంటివి లేవు. అంతేగాక చీపురు తయారీకి వాడిన పదార్థాలుగా పచ్చజొన్న మొక్కలు, కనొలా ఆయిల్, సాల్ట్, కాసిన్ని నిమ్మముక్కలు అని ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోను ‘రెడ్డిట్’లో ఓ యూజర్ పోస్ట్ చేయడంతో ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Ye jhadu me bhi 150 calorie hote hai bhai 😖
byu/Live-Bird8999 inindiameme
అయితే ఈ ఫోటోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘అరెరె.. బరువు తగ్గడానికి ఇది మంచి డైట్ ఆప్షన్’, ‘చిన్నప్పుడు ఈ క్యాలరీలు ఎక్కువగా తీసుకునేవాళ్లం’ అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

