దక్షిణపెరూలో కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
LANDSLIDE | దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 15 మంది మృతి చెందినట్టు పేరూలోని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది.
దక్షిణపెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 15 మంది మృతి చెందినట్టు పేరూలోని జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలియజేసింది. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. వీరిని రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
వర్షా బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్లు, టెంట్లు, నీటి ట్యాంకులు, ఇసుక సంచులు, విపత్తు సహాయక సిబ్బంది ద్వారా అందిస్తున్నామని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. కమనా ప్రావిన్స్‌లోని సెకోచా పట్టణానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మరో ఐదుగురు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణపెరూలో జరిగిన ఘటనపై అరేక్విపా గవర్నర్ రోహెల్ సాంచెజ్ స్పందిస్తూ దక్షిణ పెరూలోని నాలుగు పట్టణాల్లో వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. అరేక్విపా అంతటా దాదాపు 12వేల మంది వర్షాప్రభావానికి లోనయ్యారని వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- A landslide
- Died
- Heavy Rains
- Peru
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

