భద్రాచలంలో 1.98 క్వింటాళ్ల గంజాయి పట్టివేత

భద్రాచలం టౌన్ : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో పోలీసులు 1.98 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ వినీత్ బుధవారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
మంగళవారం భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈక్రమంలో అటుగా వస్తున్న రెండు కార్లను ఆపి తనిఖీ చేశారు. వాటిలో గంజాయి ప్యాకెట్లు గుర్తించారు.
కారులో గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్రలోని పూణేకు చెందిన యువరాజ్ శంకర్ దిగ్దే, అనిల్ కాంబ్లీ, దత్తాత్రేయ శివాజీమాటేను అదుపులోకి తీసుకున్నారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్ర పూణేకు గంజాయి రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.27.90 లక్షలు ఉంటుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

