సోషల్ మీడియాలో కేతికకు ఉన్న క్రేజే వేరు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే హాట్ ఫొటో షూట్లతో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ కేతికకు స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
‘రొమాంటిక్’ విడుదలకు ముందే, కేతిక శర్మ ఆన్లైన్లో కెవ్వు కేక అనిపించింది. డబ్ స్మాష్ వీడియోలు, హాట్ ఫొటో షూట్లతో కుర్రకారు మనసులు దోచేసింది. మొదటి సినిమాలోనే బోల్డ్‌గా నటించి ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది. ఆకాశ్ పూరి తాజా చిత్రంతో ప్రేక్షకులతోనూ ‘షి ఈజ్ రొమాంటిక్’ అనిపించుకున్న కేతిక గురించి..
కేతిక ఢిల్లీలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచీ అలంకరణతో అందరి దృష్టినీ ఆకర్షించేది. ఇంటర్ కాలేజ్ ఫ్యాషన్ షోలలో అందాల కిరీటం దక్కించుకొంది. చదువు పూర్తికాగానే మోడలింగ్‌లో
అడుగుపెట్టింది. అన్నట్టు, కేతిక మంచి గాయని కూడా.
‘థగ్ లైఫ్ (2016)’ వీడియోతో బాగా పాపులర్ అయ్యింది కేతిక. ఆ క్రేజ్‌ను కొనసాగించేందుకు సొంతంగా ఓ చానల్ ప్రారంభించింది. డబ్ స్మాష్ వీడియోలతో సెలబ్రిటీ హోదా సంపాదించుకుంది. సినిమాల్లోనే కాదు, యూట్యూబ్ వీడియోల్లోనూ అందాలను ఆరబోస్తూ కొత్త ట్రెండ్ సృష్టించింది.
రెండేండ్ల క్రితమే కెరీర్ మొదలైనా, కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో కేతిక టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యమైంది. ‘రొమాంటిక్’లో ఆకాశ్ పూరితో జతకట్టిన ఈ భామ హద్దులు దాటేసి మరీ అందాలు
ఆరబోసింది. సినిమా ఫస్ట్‌లుక్‌తోనే ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్’గా నిలిచిందీ ఉత్తరాది ఊర్వశి.
ఆమె ‘రొమాంటిక్’ లుక్స్‌కు ఫిదా అయిపోయారు నిర్మాతలు. కేతిక ముందు అవకాశాలు వరుస కట్టాయి. నాగశౌర్య ‘లక్ష్య’తోపాటు రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్ రాబోయే సినిమాల్లో చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాలన్నీ విజయం సాధిస్తే టాలీవుడ్లో.. కెవ్వు కేతిక!