CI Rajeshwari | తమిళనాడు రాష్ట్రాన్ని కొద్దిరోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై మహానగరం అతలాకుతలం అవుతుంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు ఏరులై పారుతోంది. ఈ క్రమంలో ఓ మహిళా పోలీసు సాహసానికి తెగించింది. భారీ వర్షాలకు శ్మశాన వాటికలో ఒక చెట్టు కూలడంతో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడిని కాపాడారు. ఇందుకోసం ఆ యువకుడిని తన భుజాలపై మోసుకెళ్లి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో ఆస్పత్రికి తరలించి ఆ యువకుడిని ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన చెన్నైలోని టీపీ ఛట్రం ఏరియాలో జరిగింది. ఆమె మహిళా పోలీసు.. సీఐ రాజేశ్వరి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హ్యాట్సాఫ్ మేడమ్.. అంటూ సీఐ రాజేశ్వరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
kangana | కంగనా రనౌత్ విలాసవంతమైన బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ ఫైర్
వర్ష బాధితులకు ఆహారం తయారీని పర్యవేక్షించిన స్టాలిన్
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
ఒక ప్రొడ్యూసర్ నా నడుం మీద చపాతీ కాలుస్తానన్నాడు.. గుర్తుచేసుకున్న బోల్డ్ బ్యూటీ
బంగ్లా విమోచనంలో భారత్కు సహకరించిన పాక్ మాజీ సైనికుడికి పద్మశ్రీ