ఒకవైపు మబ్బులతో కమ్మేసిన ఆకాశం.. మరోవైపు చినుకులు పడి మెరిసిపోతున్న ప్రేమ చిహ్నం.. తాజ్మహల్ !! ఈ అందాన్ని చూసేందుకు ముసురులోనూ సందర్శకులు విచ్చేశారు. గొడుగుల కింద ఉంటూ సెల్ఫీలు దిగుతూనే తాజ్ సౌందర్యాన్ని ఆస్వాదించారు.