Deepinder Goyal | ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో (Zomato CEO) దీపిందర్ గోయల్ (Deepinder Goyal) రెండో పెళ్లి చేసుకున్నారు. మెక్సికన్ ప్రముఖ మోడల్ (Mexican Model) గ్రేసియా మునోజ్ (Grecia Munoz)ను ఆయన రహస్యంగా మనువాడాడు. కొన్ని నెలల క్రితమే వీరి వివాహం జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో వీరు హనీమూన్‌కి కూడా వెళ్లి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై దీపిందర్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
మునోజ్ మెక్సికోలో జన్మించింది. ఆమె గతంలో ప్రముఖ మోడల్. ఇప్పుడు సొంతంగా స్టార్టప్ నడుపుతోంది. ఇక గోయల్‌కు ఇది రెండో పెళ్లి. అంతకుముందు కంచన్ జోషితో వివాహం జరిగింది. ఐఐటీ- ఢిల్లీలో చదువుకునే రోజుల్లో కంచన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి బంధం ఎక్కువకాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న గోయల్ తాజాగా మునోజ్‌ను మనువాడినట్లు తెలుస్తోంది.
Also Read..
Supreme Court | కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
Arvind Kejriwal | కేజ్రీ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. ఆప్ మంత్రులు అరెస్ట్
Heavy Rain | తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం