పర్సు పోయినా ఫుడ్ డెలివరీ ఇచ్చిన జొమాటో బాయ్.. ట్విట్టర్లో అతని కథ వైరల్!
Zomato Agent Delivers Food despite Losing Wallet | మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడెన్‌గా జేబులో పర్సు లేదనుకోండి ఏం చేస్తాం? వెంటనే వెనక్కు వెళ్లి పర్సు

Zomato Agent Delivers Food despite Losing Wallet | మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడెన్‌గా జేబులో పర్సు లేదనుకోండి ఏం చేస్తాం? వెంటనే వెనక్కు వెళ్లి పర్సు తెచ్చుకుంటాం. అదే ఎక్కడైనా పర్సు పోతే? అది దొరికే వరకూ ఉన్న పనులన్నీ మానేసి వెతుక్కుంటాం. కానీ ఒక జొమాటో డెలివరీ ఏజెంట్ మాత్రం అలా చేయలేదు.
డెలివరీ సమయంలో తన పర్సు పోయినా లెక్కచేయకుండా ఫుడ్ డెలివరీ అందించాడు. అంతేకాక రెండు నిమిషాలు ఆలస్యం అయినందుకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని సచిన్ కాల్బాగ్ అనే ఒక జొమాటో యూజర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తన ఫుడ్ తీసుకోవడానికి రెస్టారెంటుకు వెళ్లినప్పుడు మనీష్ అనే డెలివరీ బాయ్ పర్సు పోయిందని, దాని కోసం అక్కడే ఆగకుండా తనకు ఫుడ్ డెలివరీ ఇచ్చాడని సచిన్ చెప్పాడు.
వృత్తిపై అతని నిబద్ధత చూసి తనకు మతిపోయిందని మెచ్చుకున్నాడు. దీనిపై స్పందించిన జొమాటో ఇలాంటి డెలివరీ పార్టనర్లతో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ ఆర్డర్ వివరాలు తమకు ప్రైవేట్ మెసేజిలో పంపితే అతనికి సహాయం అందిస్తామని పేర్కొంది.
అయితే కొంతమంది ట్విట్టర్ యూజర్లు మాత్రం అతను అలా డెలివరీ ఇవ్వకపోతే అతనికి పెనాల్టీలు వేస్తారని, అందుకే అలా చేశాడని అంటున్నారు.
Hi @zomato @deepigoyal, mindblown by Manish Bhageluram Gupta's work ethic. He accidentally dropped his wallet at a restaurant where he picked up our food. It was stolen. Instead of waiting there, he came to our house to deliver our order, and even said sorry for the short delay. pic.twitter.com/N6DBiRo91h
— Sachin Kalbag (@SachinKalbag) October 16, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- zomato
- Zomato delivery
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

