Gang Rape Case: గ్యాంగ్ రేప్ నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
Gang Rape Case: మైనర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 23 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. యూపీలోని మెయిన్‌పురిలో అతన్ని పట్టుకున్నారు. జూన్ 23వ తేదీన జరిగిన సంఘటనలో అయిదుగురు నిందితులు ఉన్నారు.
న్యూఢిల్లీ: గ్యాంగ్ రేప్(Gang Rape)కు పాల్పడిన కీలక నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 23 ఏళ్ల ఆ వ్యక్తిని యూపీలోని మెయిన్‌పురిలో పట్టుకన్నారు. జూన్ 23వ తేదీన ఓ మైనర్‌పై ఓ ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదే రోజున ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరో ముగ్గురు ఆమెను రేప్ చేశారు. తొలుత మహమ్మద్ మిరాజ్‌తో పాటు మరో యువకుడు తనను రేప్ చేసినట్లు ఆ అమ్మాయి ఫిర్యాదులో పేర్కొన్నది. ఆ తర్వాత తన మేనమామ ఇంటికి వెళ్లాలని, ఆయన ఇద్దరు వ్యక్తులతో తనను ఇంటికి పంపించారని, అయితే ఆ ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. మైనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్వరూప్ నగర్ పోలీసు స్టేషన్లో అయిదుగురిపై కేసు నమోదు చేశారు. మిరాజ్‌తో పాటు ఓ యువకుడిని గతంలోనే అరెస్టు చేశారు. కర్నన్, కమల్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నారు. కర్నన్ ని మెయిన్‌పురిలో ప్లాన్ వేసి పట్టుకున్నారు. కర్నన్‌పై గతంలోనూ అయిదు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

