లక్నో: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఒక యువకుడు ప్రయత్నించాడు. స్లో మోషన్లో రీల్ చేశాడు. ఈ సందర్భంగా రక్షణ కోసం ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ను తెరిచాడు. దీంతో అదుపుతప్పిన ఆ యువకుడు మూడో అంతస్తు నుంచి కిందపడి మరణించాడు. (Youth Dies Of Falling) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది. సర్రాఫా బజార్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ప్రయత్నించాడు. స్లో మోషన్లో నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ కొంత దూరంలో కూర్చున్న స్నేహితుడి వద్దకు వెళ్లాడు.
కాగా, ఆ ఫ్లోర్లో రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప రెయిలింగ్‌ను మెల్లగా తెరిచేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పిన అతడు ఆ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కింద పడ్డాడు. అతడ్ని పట్టుకుని కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించి విఫలమయ్యారు. తీవ్రంగా గాయపడిన యువకుడ్ని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आगरा के सर्राफा बाजार में दर्दनाक घटना. रील बना रहे युवक की गर्दन कटी, धड़ से अलग हो गया सिर…हादसे का वीडियो आया सामने
रील बनाने के दौरान एक युवक की गर्दन लोहे के जाल से कट गई. उसका सिर धड़ से अलग हो गया #Agra #BreakingNews pic.twitter.com/WLF5AZa2TW— RITU (@Ritu9186) October 19, 2024