Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!
Video viral : బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడానికి, కొంచెం మసకమసక చీకటి ఉంటే చాలు హద్దులు దాటడానికి అస్సలు

Video viral : సమాజంలో బరితెగిస్తున్న మనుషుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సమాజంలో అందరూ కాకపోయినా కొంతమంది యువతీ యువకులు మాత్రం ఏమాత్రం బాధ్యత లేకుండా బరితెగించి తిరుగుతున్నారు. ఆఖరికి రోడ్లపై రొమాన్స్ చేయడానికీ సంకోచించడం లేదు. ఇందుకు ఆడ, మగ అనే తేడా కూడా లేదు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడానికి, కొంచెం మసకమసక చీకటి ఉంటే చాలు హద్దులు దాటడానికి అస్సలు వెనుకడుగు వేయడం లేదు.
తాజాగా, అలాంటి ఘటనే బీహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో చోటుచేసుకుంది. ఓ యువజంట బైక్‌పై వెళ్తూ బరితెగించి మరీ రొమాన్స్ చేసింది. దారి వెంట ఎంతో రమణీయంగా ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించకుండా ముద్దులాటలో మునిగితేలింది. యువకుడు బైక్ నడుపుతుండగా సినిమా స్టైల్లో యువతి అతనికి ఎదురుగా పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని ముద్దులు పెట్టింది. నడి రోడ్డుపై రన్నింగ్ బైక్‌పై ఇలా చేస్తుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు..? అనే సోయి కూడా ఆ జంటకు లేకుండా పోయింది.
బైక్ ఆపి చీవాట్లు పెట్టిన గ్రామస్తులు..
అయితే, చివరికి దారిలో ఓ గ్రామస్తులు.. ఆ బరితెగించిన జంటను ఆపి తిక్కకుదిర్చారు. నడిరోడ్డుపై సభ్యత సంస్కారం లేకుండా ఏమిటీ పిచ్చి పనులని నిలదీశారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు నడిరోడ్డుపై చేయడానికి సిగ్గలేదా అని మందలించారు. రన్నింగ్ బైక్‌పై ఇంత బరితెగింపు అవసరమా అని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కంటబడితే కాళ్లు, చేతులు విరగ్గొడుతామని హెచ్చరించారు.
ఇక గ్రామస్తుల తిట్లతో ఆ యువజంట కిక్కు దిగిపోయింది. ఊహించని పరిణామంతో వాళ్లు కంగుతిన్నారు. యువతి పెట్రోల్ ట్యాంక్ దిగి బుద్ధిగా వెనుకాల సీట్లోకి వెళ్లి కూర్చుంది. అనంతరం ఆ యువజంట గ్రామస్తులకు బాయ్ చెప్పి బతుకుజీవుడా అంటూ బయటిపడింది. అయితే, ఆ యువజంట బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Gaya
- Kissing
- young couple
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

