నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగిన మొదటి వ్యక్తిగా, పార్టీని వరుసగా రెండోసారి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగిన మొదటి వ్యక్తిగా, పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా రికార్డుల్లో నిలిచారు. గతంతో పాలిస్తే ఈ సారికొద్దిగా సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం సాయంత్రం లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆదిత్యనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో శుక్రవారం సీఎంగా వరుసగా రెండోసారి పట్టాభిషేకం చేయనున్నారు.
సీఎం ప్రమాణ స్వీకార వేడుకకు లక్నోలోని ఎకానా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈకార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌శా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆపార్టీ అగ్రనాయకులు హాజరుకానున్నారు. రాజకీయ నాయకులతోపాటు వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తంగా 85 వేల మంది పాల్గొనే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

