కాంగ్రెస్ కూటమి గెలిస్తే చొరబాట్ల ముప్పు : యోగి ఆదిత్యానాథ్

గువహటి : కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ కూటమి అసోంలో చొరబాట్లను ప్రోత్సహిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రంలో నిత్యం సమ్మెలు, వివాదాలు, ఆందోళనలు సాగాయని ఆ పార్టీ ఇప్పటికీ అదే తీరుతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఏఐయూడీఎఫ్, సీపీఎంలతో కాంగ్రెస్ దోస్తీ అసోంలో చొరబాట్లకు ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు కీలక అంశంగా మారాయి. మరోవైపు అసోం ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా విడుదల చేస్తూ అసోం ప్రజల రాజకీయ హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. సమయానుకూలంగా అసోంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

