న్యూఢిల్లీ : ర్యాపర్ యో యో హనీ సింగ్ ఓ కాన్సర్ట్‌లో హెల్పర్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మయాంక్ నథోలియా అనే యూజర్ ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. యో యో హనీ సింగ్ జైపూర్ కాన్సర్ట్‌లో ఈ క్లిప్‌ను రికార్డు చేశారు.
ఈ క్లిప్‌లో యో యో హనీసింగ్ స్టేజ్‌పై పెర్ఫామెన్స్ ఇస్తుండగా అనూహ్యంగా ఓ వ్యక్తి స్టేజిపైకి వచ్చి చీపురుతో శుభ్రం చేస్తుండగా అతడిని ర్యాపర్ గట్టిగా పట్టుకుంటాడు. ఆపై ఇద్దరు కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఈ సమయంలో హనీ సింగ్‌తో పాటు అల్పాజ్, హోమి దిల్లీవాలా కూడా వేదికపై కనిపిస్తారు.
లవ్ డోస్ సాంగ్‌కు హనీ సింగ్ పెర్ఫామ్ చేస్తుండగా హెల్పర్ కూడా కాలు కదిపాడు. ఈ క్లిప్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. హల్పర్తో ర్యాపర్ ఆడిపాడిన తీరును పలువురు ప్రశంసించగా ఇది ఓ డ్రామా అంటూ మరికొందరు కొట్టిపారేశారు.
Read More :