తెరుచుకున్న యమునోత్రి ఆలయం

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయాన్ని ఇవాళ తెరిచారు. అక్షయ త్రితియ సందర్భంగా.. కర్కాటక లఘ్నం.. అభిజిత్ ముహూర్తంలో.. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు.. ఆలయ ద్వారాలను ఓపెన్ చేశారు. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయాన్ని ముందు తెరుస్తారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో చార్ధామ్ యాత్రను రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం ఆలయ పూజారులు, అధికారులు మాత్రమే ఇవాళ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 25 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వరుసగా రెండవ ఏడాది పెద్దగా భక్తులు లేకుండానే యమునోత్రి ఆలయాన్ని తెరవడం విశేషం. సర్వ జగత్తును రోగాల నుంచి విముక్తి చేయాలని పురోహితులు ఆ దేవతను ప్రార్థించారు. ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత తొలి పూజను ప్రధాని మోదీ పేరిట నిర్వహించినట్లు పురోహితులు పవన్ ఉనియాల్ తెలిపారు. శనివారం గంగోత్రి, సోమవారం కేదార్నాథ్, మంగళవారం బద్రీనాథ్ ఆలయాలను కూడా తెరవనున్నారు. కానీ భక్తులకు మాత్రం ప్రవేశం ఉండదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

