యుమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరు.. ‘అటల్ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్‌వే ’గా మార్పు!
Yamuna expressway | యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్ హైవే పేరును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్‌వేగా

లక్నో : యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్‌వేగా మార్పు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే సమయంలో పేరు మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఆరు లైన్ల 165 కిలోమీటర్ల పొడవైన యమునా ఎక్స్‌ప్రెస్ హైవే గౌతమ్‌బుద్ధనగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాను ఆగ్రాతో కలుపుతున్నది. ఈ హైవే దేశంలోనే మూడో అతిపెద్ద పొడవైంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించారు.
దేశానికి మూడుసార్లు ప్రధానిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్‌పేయి అందరి నుంచి మన్ననలు అందుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఈ హైవేకు పేరు పెట్టాలని యూపీ సీఎం భావిస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం ప్రధాని శంకుస్థాపన చేయనుండగా.. దీంతో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలువనున్నది. ఇంతకు ముందు యూపీ ప్రభుత్వం 2018లో లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరును ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం’గా మార్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

