జనాభాలో మనమే నంబర్ 1.. చైనాను అధిగమించిన భారత్
జనాభాలో చైనాను భారత్ అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకటించింది.
- వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకటన
- ఉద్యోగాల కల్పనే అతిపెద్ద సవాల్
న్యూఢిల్లీ, జనవరి 18: జనాభాలో చైనాను భారత్ అధిగమించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకటించింది. 2022 చివరి నాటికి భారత జనాభా 141.7 కోట్లని, 2023 జనవరి 18 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకొన్నట్టు తెలిపింది. మాక్రోట్రెండ్స్ అనే సంస్థ కూడా మన దేశ జనాభా 142.8 కోట్లకు చేరిందని అంచనా వేసింది. గత 60 ఏండ్లలో తొలిసారిగా చైనా జనాభా తగ్గినట్టు తాజా నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లని ఆ దేశం ప్రకటించింది. చైనా జనాభాను భారత్ 2023 చివరి నాటికి అధిగమిస్తుందని ఐక్య రాజ్యసమితి ఇదివరకు అంచనా వేసినప్పటికీ.. ఈ రికార్డును భారత్ ఇప్పటికే అధిగమించినట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడించింది.
ఇండియా జనాభా పెరుగుదల నెమ్మదించినా కూడా 2050 వరకు పెరుగుతూనే ఉంటుందని, అప్పటికి దేశ జనాభా 167 కోట్లకు చేరుకుంటుందని ఈ సంస్థ అంచనా వేసింది. కాగా, ప్రతి పదేండ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించే మన దేశంలో 2021లో కొవిడ్ కారణంగా జనగణన జరగలేదు. 2022 నుంచి 2050 వరకు పెరగనున్న ప్రపంచ జనాభాలో సగం భారత్ సహా మరో ఏడు దేశాల నుంచే ఉంటుందని ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా పేర్కొంది.
అదే అతిపెద్ద సవాల్
మన దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ అని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధి నుంచి దేశం దూరమవుతున్నందున, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాల్సి ఉందని సూచిస్తున్నారు. దేశ జనాభాలో సగం మంది 30 ఏళ్ల లోపు వారేనని, ప్రతి యేటా లక్షల సంఖ్యలో యువత శ్రామికశక్తిగా మారుతుందని, వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

