Calcutta High Court | మిలార్డ్…మగవారిని రానీయకండి. . మహిళా ఖైదీలు గర్భిణులవుతున్నారు..!
Calcutta High Court | జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధించాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది.
Calcutta High Court | జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధించాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో సుమారు 196 మంది మహిళా ఖైదీలు పిల్లలకు జన్మనిచ్చారు. వారితోపాటు వారి పిల్లలు కూడా జైల్లోనే ఉంటున్నారు. దిద్దుబాటు గృహాల్లోని పురుష సిబ్బంది మహిళా ఖైదీల ఎన్క్లోజర్లలోకి ప్రవేశించకుండా నిషేధించాలని కోర్టుకు అమికస్ క్యూరీ తెలిపింది.
`పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని గురువారం కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలైంది. అంతే కాదు జైళ్లలో మహిళా ఖైదీలతో పాటు అంటే తల్లులైన ఖైదీలతో పాటు పిల్లలు కూడా జైల్లోనే నివసిస్తున్నారు. 196 మంది మహిళా ఖైదుల పిల్లలు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో ఉంటున్నారు. కరెక్షనల్ హోమ్స్ లో ఉన్న మహిళా ఖైదీల ఎన్‌క్లోజర్‌లలోనికి పురుష ఉద్యోగులను నిషేధించాలని పిటిషన్లో కోర్టును ఆ పిల్లో కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టులో త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఈ అంశాన్ని 2018లో సుమోటోగా విచారణకు స్వీకరించిన కలకత్తా హైకోర్టు దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని న్యాయవాది తపస్ కుమార్ భంజాను అమికస్ క్యూరీగా నియమించింది. దీనిపై అమికస్ క్యూరీగా తపస్ కుమార్ భంజా.. చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌కు తగు సూచనలతో కూడిన నోట్‌ను సమర్పించారు. జైలులోని మహిళా ఖైదీల ఎన్క్లోజర్లలోకి పురుష సిబ్బంది ప్రవేశంపై తక్షణమే నిషేధం విధించాలని ఆ నోట్లో అభ్యర్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

