Watch: ఏనుగుతో ఫొటో కోసం అమ్మాయి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Elephant Attacks Woman | ఒక అమ్మాయి ఏనుగుతో ఫొటో కోసం ప్రయత్నించింది. దాని వద్దకు ఆమె వెళ్లింది. అయితే భయపడిన ఆ ఏనుగు పిల్ల ఆమెపై దాడి చేసింది. తొండంతో తోయడంతో ఆ అమ్మాయి కింద పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: ఒక అమ్మాయి ఏనుగుతో ఫొటో కోసం ప్రయత్నించింది. దాని వద్దకు ఆమె వెళ్లింది. అయితే భయపడిన ఆ ఏనుగు పిల్ల ఆమెపై దాడి చేసింది. తొండంతో తోయడంతో ఆ అమ్మాయి కింద పడింది. (Elephant Attacks Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక యువతి ఫ్రెండ్‌తో కలిసి ఎలిఫెంట్ సఫారీ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ కొన్ని ఏనుగులు ఉన్నాయి. అయితే ఆహారం తింటున్న చిన్న ఏనుగు వద్ద ఫొటో దిగేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించింది. గొలుసుతో చెట్టుకు కట్టేసి ఉన్న దాని సమీపానికి ఆమె వెళ్లింది.
కాగా, యువతి దగ్గరగా రావడం చూసి పిల్ల ఏనుగు కంగారుపడింది. తొండంతో ఆమెను తోసింది. దీంతో ఆ అమ్మాయి కింద పడింది. అనంతరం పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె ఫ్రెండ్ రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఆ యువతిపై మండిపడ్డారు. చాలా మంది ఆమె చర్యను తప్పుపట్టారు. కొంత దూరంలో ఉన్న తల్లి ఏనుగు వద్దకు ఆమె వెళ్లి ఉంటే ఏం జరిగి ఉండేదోనని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
Girl tries to make friends with an elephant and finds out pic.twitter.com/DD5jGR6qjk
— non aesthetic things (@PicturesFoIder) February 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- close to
- elephant
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

