న్యూఢిల్లీ : మనం ఎప్పుడైనా నిస్ప్రహకు లోనై ఒంటరిగా ఫీలైతే పెంపుడు జంతువులు (Viral Video) మనకు ఆసరాగా నిలిచి మనం మళ్లీ రొటీన్లో పడేలా వెన్నంటి ఉంటాయి. అవి మనల్ని షరతులు లేకుండా ప్రేమించినా ఒక్కోసారి మనపై అజమాయిషీ కూడా చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా తాజాగా ఈ తరహా వీడియోను వైరల్‌హాగ్ అనే అకౌంట్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
ఈ వీడియోలో ఓ మహిళ ఫ్లూట్ ప్లే చేస్తూ ప్రాక్టీస్ చేస్తుండటం కనిపిస్తుంది. ఆమె ఫ్లూట్ వాయిస్తుండగా ఎదురుగా ఉన్న నోట్స్‌తో కూడిన స్టాండ్ సెట్‌ను పిల్లి అదే పనిగా కదుపుతుండటం చూడొచ్చు. స్టాండ్ వెనక్కి పడిపోతుండగా ఆమె సర్ధుబాటు చేస్తుంటుంది. మీ ఇంట్లో పిల్లులు ఉంటే ప్రశాంతంగా ఉండలేరు అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోను 41,000 మందికి పైగా వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఈ హిలేరియస్ వీడియోను పెంపుడు జంతువుల యజమానులు ఆస్వాదించారు. ఇలాంటివి తమకూ అనుభవమే అని కామెంట్స్ సెక్షన్లో పలువురు రాసుకొచ్చారు.
Read More :