Watch: మేక కోసం కూడా రైలు టికెట్ తీసుకున్న మహిళ.. ఆశ్చర్యపోయిన టీటీఈ
Woman Takes Train Ticket For Goat | రైలులో ప్రయాణించిన ఒక మహిళ తన వెంట మేకను తీసుకెళ్లింది. అయితే ఆ మేక ప్రయాణం కోసం కూడా ఆమె రైలు టికెట్ కొనుగోలు చేసింది. (Woman Takes Train Ticket For Goat) ఇది చూసి టీటీఈ ఆశ్చర్యపోయాడు. ఆ మహిళ నిజాయితీకి ఫిదా అయ్యాడు.
కోల్కతా: రైలులో ప్రయాణించిన ఒక మహిళ తన వెంట మేకను తీసుకెళ్లింది. అయితే ఆ మేక ప్రయాణం కోసం కూడా ఆమె రైలు టికెట్ కొనుగోలు చేసింది. (Woman Takes Train Ticket For Goat) ఇది చూసి ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్(టీటీఈ) ఆశ్చర్యపోయాడు. ఆ మహిళ నిజాయితీకి ఫిదా అయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. ఒక వృద్ధురాలు తన భర్తతోపాటు మేకతో కలిసి రైలులో ప్రయాణించింది. ఇంతలో టికెట్ తనిఖీ చేసే రైల్వే అధికారి ఆ మహిళ వద్దకు వచ్చాడు. ఆమెతోపాటు మేక ఉండటాన్ని చూశాడు. రైలు టికెట్ చూపమని ఆ మహిళను అడిగాడు. వెంట ఉన్న మేక కోసం కూడా టికెట్ తీసుకున్నావా అని ప్రశ్నించాడు.
కాగా, ఆ వృద్ధురాలు ఏ మాత్రం బెదరలేదు. మేక కోసం కూడా రైలు టికెట్ తీసుకున్నట్టు నవ్వుతూ హుందాగా చెప్పింది. ఆ టికెట్ను టీటీఈకి చూపించాలని తన భర్తతో అన్నది. ఆ వ్యక్తి రైలు టికెట్ను అతడికి చూపించాడు. ఆ టికెట్లో ఇద్దరు వ్యక్తులతోపాటు మేక ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది చూసి ఆ టీటీఈ ఆశ్చర్యపోయాడు. ఆ వృద్ధురాలి నిజాయితీ, గౌరవానికి ఫిదా అయ్యాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అని నెటిజన్లు కొనియాడారు. ఆ మహిళకు మేక కేవలం ఒక జంతువు కాదని, ఆమె కుటుంబంలో భాగమని మరొకరు వ్యాఖ్యానించారు. ఆ వృద్ధురాలి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఒకరు అన్నారు. ఆ మహిళ మనస్తత్వం, గుండె నిబ్బరాన్ని ఆమె నవ్వు చాటుతున్నదని మరొకరు ప్రశంసించారు. సింపుల్గా, నిజాయితీగా ఉండే ఇలాంటి భారతీయులు దేశానికి గర్వకారణమని మరికొందరు కొనియాడారు.
Got this video in WA
This lady is taking her goat in the train..and she bought a ticket for the goat.
Look at her pride in her own honesty when she replies to the ticket collecting officer pic.twitter.com/2Du1Gq8a6o— D Prasanth Nair (@DPrasanthNair) September 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Goat
- Surprised
- Train Ticket
- tte
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

