Husband Murder | భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం.. ఆపై హత్య
Husband Murder | భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన ఓ భార్య కొన్ని గంటలకే అతడికి విషమిచ్చి చంపింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లా ఇస్మాయిల్పూర్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తన భర్త శైలేశ్ కుమార్(32)కు వేరే మహిళతో సంబంధం ఉందన్న అనుమానం కారణంగా సవిత అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
- కర్వా చౌత్ నాడు భర్తను చంపిన భార్య
Husband Murder | ఇస్మాయిల్‌పూర్, అక్టోబర్ 21 : భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన ఓ భార్య కొన్ని గంటలకే అతడికి విషమిచ్చి చంపింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లా ఇస్మాయిల్పూర్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తన భర్త శైలేశ్ కుమార్(32)కు వేరే మహిళతో సంబంధం ఉందన్న అనుమానం కారణంగా సవిత అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. కర్వా చౌత్ పండుగ సందర్భంగా భర్త దీర్ఘాయుష్షు కోసం ఆదివారం సవిత ఉపవాసం ఉంది. శైలేశ్ పండగ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సాయంత్రం ఉపవాసం విరమించిన తర్వాత సవిత తన భర్తతో గొడవ పడింది. అయితే ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించింది. దంపతులిద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత భర్తను పక్కింటికి వెళ్లి ఏదో వస్తువు తెమ్మని చెప్పి సవిత పారిపోయింది. శైలేశ్ తిన్న భోజనంలో విషం కలిసిందని తెలిసి అతడిని దవాఖానకు తరలించారు. అక్కడ అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. చికిత్స పొందుతూ శైలేశ్ మృతి చెందాడు. పోలీసులు సవితను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

