పసివాడితోసహా రైలు ముందు దూకి తల్లి ఆత్మహత్య..!
Woman suicide with son: కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త రోజూ గొడవపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ

లక్నో: కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త రోజూ గొడవపడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన 9 నెలల కొడుకుతో కలిసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకింది. ఈ ఘటనలో తల్లీకొడుకు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలోని హరిహర్‌గంజ్ పట్టణ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హరిహర్గంజ్కు చెందిన ఉమేశ్ కుమార్ పటేల్, అర్చనా పటేల్ ఇద్దరూ భార్యాభర్తలు. ఉమేశ్ కుమార్ కాన్స్పూర్ రైల్వేస్టేషన్లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అర్చనా పటేల్ గృహిణి. అయితే, ఈ మధ్య ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో మనస్తాపానికి గురైన అర్చన ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. కాగా, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

