భారతీయ మహిళలు అత్యంత ప్రతిభావంతులు. గ్రామీణ మహిళలు చాలా కష్ట పడుతుంటారు. ఉదయాన్నే లేసింది మొదలు రాత్రి పడుకునేవరకు ఇంటిపనులను ఎంతో నైపుణ్యంతో నిర్వహిస్తుంటారు. కాగా, ఓ దేశీ మహిళ గోడపై పిడకలు కొట్టే నైపుణ్యం ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్‌ను ఆకట్టుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఐఏఎస్ ఆఫీసర్ అవనీశ్ శరణ్ ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్చేశారు. ఇందులో ఒక మహిళ పిడుకలు చేస్తున్నది. చాలా ఎత్తైన గోడపై పిడకలను చాలా నైపుణ్యంతో విసురుతున్నది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆమె గురి తప్పడం లేదు. పిడకలన్నీ గోడపై వరుసక్రమంలో పేర్చింది. ‘భారత్ బాస్కెట్ బాల్ జట్టు ఆమె కోసం వెదుకుతోంది’ అని ఈ వీడియోకు అవనీశ్ శర్మ క్యాప్షన్ ఇచ్చాడు.
Indian basket ball team is searching for her. pic.twitter.com/hE2dBy7nAu
— Awanish Sharan (@AwanishSharan) June 29, 2022