Stabbed To Death | కర్ణాటకలో దారుణం.. మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను కత్తితో పొడిచి హత్య
Stabbed To Death | మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. (Stabbed To Death) ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ దారుణం జరిగింది.
బెంగళూరు: మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. (Stabbed To Death) ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కెమ్మన్ను ప్రాంతంలోని ఒక ఇంట్లోకి మాస్క్ ధరించిన వ్యక్తి చొరబడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. కత్తి పోటు వల్ల 46 ఏళ్ల హసీనా, 23, 21, 12 ఏళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఉడిపి జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతురాలి భర్త గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మహిళ, ఆమె ముగ్గురు పిల్లల హత్యకు కారణం ఏమిటన్నదని తెలియదని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

