Woman Dies During Illegal Abortion | అబార్షన్ బెడిసికొట్టి మహిళ మృతి.. నర్సుతోపాటు ఆమె తల్లిదండ్రులు అరెస్ట్
Woman Dies During Illegal Abortion | అబార్షన్ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఒక మహిళ మరణించింది. దీంతో అబార్షన్ చేసిన నర్సుతోపాటు ఆ మహిళ తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా మరోసారి గర్భం దాల్చిన ఆమెకు ఈసారి కూడా ఆడ పిండంగా స్కానింగ్‌లో నిర్ధారించినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
బెంగళూరు: అబార్షన్ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఒక మహిళ మరణించింది. (Woman Dies During Illegal Abortion) దీంతో అబార్షన్ చేసిన నర్సుతోపాటు ఆ మహిళ తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా మరోసారి గర్భం దాల్చిన ఆమెకు ఈసారి కూడా ఆడ పిండంగా స్కానింగ్‌లో నిర్ధారించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. కర్ణాటకు చెందిన 33 ఏళ్ల సొనాలి తన భర్తతో కలిసి మహారాష్ట్రలోని సాంగ్లీలో నివసిస్తున్నది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. సొనాలి మరోసారి గర్భం దాల్చింది. స్కానింగ్‌లో ఆడ పిండంగా తెలుసుకుంది.
కాగా, తల్లిదండ్రులు ఉంటున్న కర్ణాటక బాగల్కోట్ జిల్లాలోని మహాలింగ్పూర్కు సొనాలి చేరుకుంది. కవిత అనే నర్సు ఇంట్లోనే సొనాలికి అబార్షన్ చేసింది. అయితే విఫలం కావడంతో మే 27న ఆ గర్భిణీ మరణించింది.
మరోవైపు మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీసులకు ఈ విషయం తెలిసింది. ప్రైవేట్ ఆసుపత్రిలో క్లీనింగ్ స్టాఫ్‌గా పని చేస్తున్న కవిత తన ఇంట్లో అక్రమంగా స్కానింగ్ మెషిన్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. సొనాలి నుంచి రూ.40,000 తీసుకుని అక్రమంగా స్కానింగ్ చేసి లింగ నిర్ధారణతోపాటు అబార్షన్ చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. దీంతో కవితతో సహా ఏడుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, అబార్షన్ చేయించుకోవాలని సొనాలిని ఆమె తల్లిదండ్రులు ప్రొత్సహించినట్లు దర్యాప్తులో పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేశారు. దీంతో మృతురాలి తండ్రి సంజయ్ గౌలి, తల్లి సంగీతను మహాలింగ్‌పూర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

