లక్నో: ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ రైలులో బీజేపీ కార్యకర్తలు తన పట్ల అనుచితంగా ప్రవర్తించి వేధించారని ఒక మహిళ ఆరోపించింది. (Woman alleges BJP workers misbehaved) బీజేపీ కార్యకర్తలు తనను కొట్టినట్లు ఆమెతోపాటు ఉన్న మరో వ్యక్తి వాపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శనివారం కొత్తగా ప్రారంభించిన మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ సంఘటన జరిగింది. తానియా అనే యువతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మీడియాతో మాట్లాడింది. తన సహచరుడితో కలిసి ఫుడ్ కోసం పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్లగా ‘ఇది బీజేపీ క్యాబిన్’ అంటూ ఆ పార్టీ కార్యకర్తలు తమను అడ్డుకున్నారని ఆమె ఆరోపించింది. తమ సీట్లకు తిరిగి వెళ్లేందుకు మళ్లీ ఆ కంపార్ట్ మీదుగా వచ్చేందుకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు మళ్లీ అడ్డుకున్నారని, తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు తమను నెట్టారని, వేధించారని ఆమె ఆరోపించింది. తాము కూడా బీజేపీకి చెందినవారిమే అన్న ఆమె ఇలాంటి వారి వల్ల పార్టీ పరువు పోతోందని విమర్శించింది. ‘ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. రైలు ప్రజల ఆస్తి, వ్యక్తిగత లేదా బీజేపీ ఆస్తి కాదు’ అని ఎక్స్ పోస్ట్‌లో మండిపడింది.
కాగా, ఆ యువతి వెంట ఉన్న వ్యక్తి కూడా బీజేపీ కార్యకర్తలు తనను కొట్టినట్లు మీడియా ముందు ఆరోపించాడు. ఇంతలో పోలీసులు అక్కడకు వచ్చారు. వారిద్దరికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ యువతి, యువకుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. ‘బీజేపీ ప్రవర్తన, స్వభావానికి ఈ వీడియో సాక్షి’ అని విమర్శించింది.
नरेंद्र मोदी ने आज मेरठ से लखनऊ वंदे भारत ट्रेन को हरी झंडी दिखाई।
फिर इस ट्रेन में BJP के नेताओं ने कब्ज़ा जमा लिया।
ट्रेन में मौजूद एक महिला यात्री जब खाना लेने जा रही थी, तो BJP के नेताओं ने उससे बदसलूकी और मारपीट की।
ये वीडियो BJP के चाल, चरित्र और चेहरे का गवाह है। 👇 pic.twitter.com/cDsMOBNT98
— Congress (@INCIndia) August 31, 2024
मेरठ–लखनऊ वंदेभारत ट्रेन के शुभारंभ पर रेलवे ने कुछ सोशल मीडिया इनफ्लूएंसर भी बुलाए थे। ट्रेन में जिस लड़की से बदसलूकी हुई, वो भी एक इनफ्लूएंसर है। खुद को BJP से बताने वाले व्यक्ति पर बदसलूकी करने, धक्का देने का आरोप है। RPF इस मामले में FIR दर्ज कर रही है। https://t.co/NsZAY6rGPO pic.twitter.com/1HcKM3poYe
— Sachin Gupta (@SachinGuptaUP) August 31, 2024