Southwest Monsoon | మొదలైన నైరుతి రుతుపవనాల తిరోగమనం : ఐఎండీ
Southwest Monsoon | దేశంలో నైరుతి రుతుపవనాల తిరుగోమనం మొదలైందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ సారి రుతుపవనాల ఉపసంహరణ సాధారణం కంటే ఎనిమిది రోజులుగా మొదలైందని పేర్కొంది. వాస్తవానికి సెప్టెంబర్ 17 వరకు వాయువ్య దిశ నుంచి తిరోగమనం మొదలుకావాల్సి ఉండగా.. ఈ సారి సెప్టెంబర్ 25న మొదలైనట్లు పేర్కొంది.
Southwest Monsoon | దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ సారి రుతుపవనాల ఉపసంహరణ సాధారణం కంటే ఎనిమిది రోజులుగా మొదలైందని పేర్కొంది. వాస్తవానికి సెప్టెంబర్ 17 వరకు వాయువ్య దిశ నుంచి తిరోగమనం మొదలుకావాల్సి ఉండగా.. ఈ సారి సెప్టెంబర్ 25న మొదలైనట్లు పేర్కొంది. రాజస్థాన్లోని నైరుతి ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాలు సోమవారం పూర్తిగా నిష్క్రమించినట్లు భారత వాతావరణశాఖ పేర్కొంది.
రుతుపవనాలు తిరోగమనం ఆలస్యం కావడం ఇది 13వ సారి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా జూన్ 8న దేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, సెప్టెంబర్ 30 వరకు దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో సాధారణ సగటు 868.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా.. వర్షాపాతం ఏడుశాతం తగ్గింది. రుతుపవనాలు భారత ఉపకండంలో పంటలను ప్రభావితం చేస్తుందని ఐఎండీ పేర్కొంది.
రుతుపవనాలు తిరోగమనం ఆలస్యమైతే.. వర్షాకాలం ఎక్కువ కాలం ఉంటుందని, వ్యవసాయరంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని తెలిపింది. వాయువ్య భారతదేశంలో రబీ ఉత్పత్తిలో రుతుపవనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు గంగా మైదానం ద్వారా బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో ఈశాన్యం నుంచి తిరోగమనం చెందడంతో వీటిని ఈశాన్య రుతుపవనాలుగా పేర్కొంటారు. వీటితో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

