Mamata Banerjee | ‘కాంగ్రెస్‌కు మద్దతిస్తాం, కానీ…’, ప్రతిపక్షాల ఐక్యతపై మమతా బెనర్జీ కండీషన్
Mamata Banerjee | మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపక్షాల ఐక్యతపై సోమవారం స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. అయితే ఆ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని కండీషన్ పెట్టారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపక్షాల ఐక్యతపై సోమవారం స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. అయితే ఆ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని కండీషన్ పెట్టారు. ప్రతిపక్షాల ఐక్యతపై ఈ మేరకు తొలిసారి నోరు విప్పారు. ఆ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘కాంగ్రెస్ బలంగా ఉన్న చోట, వారిని పోరాడనివ్వండి. మేం వారికి (కాంగ్రెస్‌కు) మద్దతు ఇస్తాం. అందులో తప్పు లేదు. అయితే ఇతర రాజకీయ పార్టీలకు కూడా వారు (కాంగ్రెస్) మద్దతు ఇవ్వాలి’ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు కావాలంటే ఆ పార్టీ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం గురించి కూడా మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల హవా ఉన్న చోట వాటికే సీట్లు కేటాయించాలని అన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీజేపీని అధికారం నుంచి దించిన కర్ణాటక ప్రజలకు తొలుత ఆమె అభివాదం చేశారు. అయితే అక్కడ గెలిచిన కాంగ్రెస్ పార్టీ గురించి ఈ సందర్భంగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

