Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Will Sit On Dharna | దేశ రాజధానిలోని ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు తగిన చర్యలు చేపట్టకపోతే హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద తామే స్వయంగా కూర్చొని ధర్నా చేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఢిల్లీ హైకోర్టు సమీపంలో రహదారి భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులు తగిన చర్యలు చేపట్టకపోతే హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద తామే స్వయంగా కూర్చొని ధర్నా చేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. (Will Sit On Dharna) ఢిల్లీ హైకోర్టు సమీపంలోని మధుర రోడ్డు కూడలి వద్ద రహదారి భద్రత, సరైన ట్రాఫిక్ నిర్వహణ లేకపోవడం, పాదచారుల భద్రతా పరమైన సమస్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది.
కాగా, ఒక కమిటీ ఈ సమస్యను పరిశీలిస్తున్నదని, ఉన్నతాధికారులతో తాను చర్చించానని కేంద్ర ప్రభుత్వం తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఉన్నత స్థాయి కమిటీ అవసరమేమిటని కోర్టు ప్రశ్నించింది. సమస్యను ఖచ్చితంగా గుర్తించి, పరిష్కారాన్ని కనుగొనేందుకు ‘అమికస్ క్యూరీ’ (కోర్టుకు సహాయం చేసే వ్యక్తి)ని భాగస్వామిగా చేయాలని సూచించింది. అధికారులు కమిటీ చర్చలకే పరిమితం కాకుండా, తదుపరి విచారణకు ముందే అవసరమైన క్షేత్రస్థాయి పనులను పూర్తి చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోవైపు గడువులోగా అధికారులు స్పష్టమైన పరిష్కారాన్ని అమలు చేయడంలో విఫలమైతే, ఏఎస్జీతో పాటు ప్రధాన కార్యదర్శి కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నవంబర్ 25లోపు తగిన చర్యలు చేపట్టకపోతే, తామే స్వయంగా హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద ‘ధర్నా’ చేస్తామని పేర్కొంది. ‘ఒకవేళ మీరు ఈ పని పూర్తి చేయకపోతే, మేమిద్దరం (సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు) ఢిల్లీ హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద కూర్చుంటాం. పని పూర్తయ్యే వరకు అక్కడి నుంచి మేం కదలబోము, ఇంటికి కూడా వెళ్లము. ఇది ఖాయం. మిమ్మల్ని కూడా ఇంటికి వెళ్లనివ్వం’ అని ధర్మాసనం సరదాగా వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ప్రస్తుతం వివిధ అంశాలపై అనేక నిరసనలు జరుగుతున్న తరుణంలో, సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

