నీట్ బిల్లును ఎప్పటికీ ఆమోదించను!
నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో అత్యుత్తమంగా ఉండాలని భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం నీట్ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి వద్ద ఉన్నది. శనివారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో నీట్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.
చెన్నై, ఆగస్టు 12: నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో అత్యుత్తమంగా ఉండాలని భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం నీట్ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి వద్ద ఉన్నది. శనివారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో నీట్లో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.
బిల్లుపై ఓ విద్యార్థి తండ్రి అడిగిన ప్రశ్నకు గవర్నర్ పై విధంగా స్పందించారు. ‘నేను స్పష్టంగా చెబుతున్నాను. నీట్ బిల్లుకు నేను ఆమోదం తెలుపను. ఏదేమైనా ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున, బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. ఇది రాష్ట్రపతి మాత్రమే ఆమోదించే అంశం’ అని పేర్కొన్నారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ స్టాలిన్ ప్రభుత్వం గత ఏడాది బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం విషయంలో గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
Mahesh Kumar Goud | చామల ఎవడు.. కమిటీలు ప్రకటించే అధికారం ఆయనకెక్కడిది?.. మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం
Kazipet Land Scam | 4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు.. కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

