Rahul Gandhi | జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు.. పార్లమెంటులో పోరాడతాం: రాహుల్ గాంధీ
Rahul Gandhi | జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు పార్లమెంటులో పోరాడతామని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. దాని కోసం వీధుల్లోకి కూడా వెళ్తామని అన్నారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు పార్లమెంటులో పోరాడతామని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పునరుద్ఘాటించారు. దాని కోసం వీధుల్లోకి కూడా వెళ్తామని అన్నారు. బుధవారం జమ్మూలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రజల శ్రేయస్సును అంతం చేయడానికి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), బయటి వ్యక్తుల ద్వారా ఈ ప్రాంతాన్ని నడపాలని బీజేపీ భావించిందని విమర్శించారు. అందుకే జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాను లాక్కున్నదని ఆరోపించారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ ఉండే వరకు, జమ్ముకశ్మీర్ ప్రజల కష్టాల వల్ల బయటి వ్యక్తులు ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు’ అని విమర్శించారు.
కాగా, జమ్ముకశ్మీర్ ఎన్నికలు ప్రజల హక్కులకు సంబంధించినవని రాహుల్ గాంధీ తెలిపారు. ‘రాష్ట్ర హోదాను మేం పునరుద్ధరిస్తాం. స్థానిక పరిశ్రమలను మా ప్రభుత్వం కాపాడుతుంది. సామాన్యుల కోసం బ్యాంకుల తలుపులు తెరుస్తాం’ అని అన్నారు.
మరోవైపు దేశ చరిత్రలో 1947 నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా, రాష్ట్రాలను రెండుగా విభజించిన సందర్భాలు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఏనాడూ ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించలేదన్నారు. ఇది ప్రజలకు తీవ్ర అన్యాయమని అన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ హరించిందని విమర్శించారు.
ఎన్నికల ముందు రాష్ట్ర హోదాను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని తామంతా భావించామని, అదే సరైన మార్గమని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే వారు (బీజేపీ) మొదట ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. ‘ఏదైనా కారణం చేత బీజేపీ దీనిని చేయకపోతే, ఇండియా కూటమి ప్రభుత్వం మొదటి పని ఇదే. ఎందుకంటే రాష్ట్ర హోదా ఇవ్వడం మీ హక్కు’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

