మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. పార్టీని గాడిలో పెడతా!

చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఓ పార్టీ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్లో ఆమే ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి ముగిసిన తర్వాత తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. దీనికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని, ఏఐఏడీఎంకే పార్టీని గాడిలో పెడతానని శశికళ స్పష్టం చేసింది. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం బాధపడకండి. నేను కచ్చితంగా తిరిగి వస్తా. పార్టీని గాడిలో పెడతా. ధైర్యంగా ఉండండి. కరోనా ముగియగానే నేను వస్తా అని శశికళ చెప్పడం ఆ ఆడియో క్లిప్‌లో వినిపిస్తుంది. మేము మీ వెంటే ఉంటామని పార్టీ క్యాడర్ చెప్పడం కూడా అందులో వినిపించింది. ఈ కాల్ నిజమేనని, ఈ విషయాన్ని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ వ్యక్తిగత సహాయకుడు జనార్దనన్ ధృవీకరించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమిళనాడు ఎన్నికల్లో కీలకపాత్ర పోసిస్తుందని భావించిన శశికళ అనూహ్యంగా రాజకీయాల్లో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఓడిపోవడంతో శశికళ మరోసారి రాజకీయాల్లోకి రావడంపై చర్చ మొదలైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

