న్యూఢిల్లీ: ఒక మహిళ భర్త మాల్లో మరో మహిళతో కలిసి కనిపించాడు. దీంతో అతడి భార్య రెచ్చిపోయింది. మాల్లో అంతా చూస్తుండగా భర్త చెంపపై కొట్టింది. (Wife Slaps Husband In Mall) ఆ తర్వాత భర్త ప్రియురాలి జుట్టు లాగడంతో ఆమె కింద పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భర్త మరో మహిళతో కలిసి షాపింగ్ మాల్లో ఉండటం అతడి భార్య కంటపడింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆమె అనుమానించింది. దీంతో ఆ మహిళ ఆగ్రహంతో భర్త చెంపపై కొట్టింది. ఆ తర్వాత తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్లసాగింది. మధ్యలో భర్త ప్రియురాలిగా అనుమానించిన మహిళ జుట్టును గట్టిగా లాగింది. దీంతో ఆమె కింద పడగా, పైకి లేచేందుకు ఆ వ్యక్తి సహకరించాడు. అనంతరం వారిద్దరూ కలిసి ఆ షాపింగ్ మాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఈ సంఘటనను తన మొబైల్లో రికార్డ్ చేశాడు. ఎక్స్ ( ట్విట్టర్) యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
Extra-Marital affair kalesh (Wife Caught her Hisband with other lady inside Mall) pic.twitter.com/d1jekkE9os
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 29, 2024