ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి భార్య హత్య.. నిందితుడి అరెస్ట్

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం(67) హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె హత్యకు గురైంది. ఇంట్లో ధోబీగా పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో నిందితుడు రాజు, కిట్టి కుమారమంగళం ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ కొట్టగా పనిమనిషి తలుపు తీసింది. వెంటనే ఆమెపై మత్తుమందు చల్లి ఓ గదిలో పడేశాడు. మరో ఇద్దరు యువకులు కిట్టి కుమారమంగళం గదిలోకి వెళ్లి ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. రెండు గంటల తర్వాత పనిమనిషికి మెలకువ వచ్చి చూడగా కిట్టి కుమారమంగళం అచేతనంగా పడిఉంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చుడగా అప్పటికే ఆమె చనిపోయింది.
పనిమనిషి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ధోబి రాజును అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. డబ్బు, బంగారం కోసమే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావించారు. దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో(1998-2001) పి. రంగరాజన్ కుమారమంగళం కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

