Karnataka High Court: అలాంటి భార్యకు మెయింటేనెన్స్ ఇవ్వడం తగదు: కర్నాటక హైకోర్టు
Karnataka High Court: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త నుంచి మెయింటేనెన్స్ కోరడం తగదు అని కర్నాటక హైకోర్టు పేర్కొన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది.
బెంగుళూరు: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త నుంచి మెయింటేనెన్స్ కోరడం తగదు అని కర్నాటక హైకోర్టు(Karnataka High Court) పేర్కొన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది. గృహ హింస చట్టం ప్రకారం తనకు భర్త నుంచి మెయింటేనెన్స్ ఇప్పించాలని భార్య పెట్టుకున్న కేసును జస్టిస్ రాజేంద్ర బాదామికర్ విచారించారు. ఆ మహిళ వ్యక్తిత్వం నిజాయితీగా లేదని, ఆమె పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతనితోనే ఆమె ఉంటోందని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. పిటీషనరే అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆమె ఎలా మెయింటేనెన్స్ కోరుకుంటుందని కోర్టు ప్రశ్నించింది.
పిటీషనర్ ప్రవర్తన సరిగా లేని కారణంగా ఆమెకు రావాల్సిన మెయింటేనెన్స్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది. భర్త మరో వ్యక్తితో అక్రమ రిలేషన్లో ఉన్నట్లు భార్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు పేర్కొన్నది. భార్యకు మెయింటేనెన్స్ ఇవ్వాలని గతంలో మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ భర్త కోర్టును ఆశ్రయించాడు. మెజిస్ట్రేట్ ఆదేశాలను అదనపు సెషన్స్ జడ్జి కొట్టిపారేశారు. దీంతో మళ్లీ రివిజన్ పిటీషన్ వేసింది ఆ మహిళ. ఆ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ.. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు మెయింటేనెన్స్ ఇవ్వలేమని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

