Neha Singh Rathore: పెహల్గామ్ దాడిపై సోషల్ మీడియాలో పోస్టులు.. నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకీ ఆమె ఎవరు ?
Neha Singh Rathore: సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై.. లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టులు చేసింది. దీంతో ఆమెపై కేసు బుక్ చేశారు.
న్యూఢిల్లీ: జానపద గాయని నేహా సింగ్ రాథోడ్(Neha Singh Rathore)పై.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె పలు పోస్టులు చేసింది. వాటిల్లో ఆమె ఓ మత వర్గాన్ని టార్గెట్ చేసింది. దీంతో ఆమెపై ఫిర్యాదు నమోదు అయ్యింది. అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఆ సింగర్‌పై కేసు పెట్టారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిందని, మత ఘర్షణలు ప్రోత్రహించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు ఫిర్యాదులో ఆరోపించారు.
నేహా సింగ్ రాథోడ్ ఓ పొలిటికల్ సెటైరిస్ట్. జానపద గాయని కూడా. భోజ్‌పురి పాటలు ఆమె పాడుతుంది. 1997లో పుట్టిందామె. బీహార్‌లోని జన్‌దాలో పెరిగింది. 2018లో ఆమె కాన్పూర్ వర్సిటీ నుంచి బిఎస్సీ పట్టా పొందింది. 2019లో బోజ్‌పురి పాటలు పాడడం స్టార్ట్ చేసింది. మొబైల్ ఫోన్లో రికార్డింగ్ చేసేది. వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేసేది. భోజ్‌పురి కవులు బికారి థాకూరి, మహేందర్ మిస్రిలు తనకు ఇన్స్పిరేషన్ అని చెబుతోంది.
2020 మే నెలలో ఆమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. కోవిడ్19 గురించి అప్పుడు హైలెట్ చేసిందామె. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్లో తన వీడియోలు షేర్ చేసింది. అక్టోబర్ 2020 నాటికి రాజకీయ విమర్శకురాలిగా ఆమెకు గుర్తింపు వచ్చింది. 2021 నాటికి ఆమె యూట్యూబ్ ఛానల్‌కు లక్ష మంది సబ్స్క్రైబర్లు వచ్చేశారు. బీహార్ మే కాబా, యూపీ మే కా బీ, యూపీ మే కాబా సీజన్ 2, ఎంపీ మే కాబా పాటలు పాడిందామె. అవన్నీ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాయి. 2023 జూలైలో ఆమె వివాదంలో ఇరుక్కున్నది. ఓ గిరిజన కార్మికుడిపై మూత్రం పోసిన వీడియోతో ఆమె మధ్యప్రదేశ్‌లోనూ పాపులరైంది.
భారతీయ న్యాయ సంహిత చట్టం కింద ప్రస్తుతం నేహ సింగ్‌పై కేసు బుక్ చేశారు. లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు.
पहलगाम हमले के जवाब में अब तक सरकार ने क्या किया है? मेरे ऊपर FIR ?
अरे दम है तो जाइये…आतंकवादियों के सिर लेकर आइये!
सरकार मेरे ऊपर FIR करवाकर असली मुद्दों से ध्यान भटकाना चाहती है…क्या ये बात समझना इतना मुश्किल है? pic.twitter.com/mOuKPzYYoF
— Neha Singh Rathore (@nehafolksinger) April 28, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

