Nandini Gupta | నందిని గుప్తా ఎవరు.. ? మిస్ ఇండియా నుంచి మిస్ వరల్డ్ టాప్ మోడల్ చాలెంజ్ వరకు ప్రయాణం..!
Nandini Gupta | నందిని గుప్తా భారత్‌కు చెందిన ఓ మోడల్. ఆత్మవిశ్వాసం, అందం, కృషి పట్టుదలతో ఫెమినా మిస్ ఇండియా-2023 టైటిల్‌ని గెలిచింది. ప్రస్తుతం మిస్‌వరల్డ్ పోటీల్లో టాప్ మోడల్ చాలెంజ్ విజేతగా నిలిచి అంతర్జాతీయంగా భారత్ గర్వపడేలా చేసింది.
Nandini Gupta | నందిని గుప్తా భారత్‌కు చెందిన ఓ మోడల్. ఆత్మవిశ్వాసం, అందం, కృషి పట్టుదలతో ఫెమినా మిస్ ఇండియా-2023 టైటిల్‌ని గెలిచింది. ప్రస్తుతం మిస్‌వరల్డ్ పోటీల్లో టాప్ మోడల్ చాలెంజ్ విజేతగా నిలిచి అంతర్జాతీయంగా భారత్ గర్వపడేలా చేసింది. తమ కలలను నిజం చేసుకునే ధైర్యం ఉన్న భారతదేశంలోని కొత్త తరం మహిళలలో నందిని గుప్తా ఒకరు. మిస్ ఇండియా నుంచి మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఛాలెంజ్‌కు ఆమె ప్రయాణం అందాల పోటీల్లో రాణించాలన్న యువతులకు ప్రేరణగా నిలుస్తున్నది. మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత నటనతో పాటు ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్రవేసిన ప్రియాంక చోప్రాను ప్రేరణగా తీసుకున్నట్లు నందిని గుప్తా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నందిని గుప్తా ఎవరు ? ఇప్పటి వరకు అందాల పోటీల్లో ఆమె ప్రయాణం ఎలా సాగిందో ఓసారి తెలుసుకుందాం రండి..!
నందిని గుప్తా 2003 సెప్టెంబర్ 13న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. ఆమె వయస్సు 21 సంవత్సరాలు. ముంబయిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో విద్యనభ్యసించింది. వృత్తిరీత్యా మోడల్ అయిన నందిని ఆ తర్వాత అందాల పోటీల్లోనూ రాణించింది. 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని నందిని గుప్తా గెలుచుకుంది. రాజస్థాన్‌కు చెందిన నందిని చిన్నప్పటి నుంచి మిస్ ఇండియా కావాలని కలలు కన్నది. ఆమె తన ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామాజిక సమస్యలపై అవగాహనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకొని టైటిల్‌ను సాధించింది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్ తరఫున పాల్గొంటున్నది. నందిని టాప్ మోడల్ చాలెంజ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది.
ఈ చాలెంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీదారులు ర్యాంప్ వాక్, స్టయిలింగ్, నైపుణ్యం ఆధారంగా పోటీదారులను ఎంపిక చేయగా.. నందిని గుప్తా ఆసియా ఓషియానా విజేతగా ఎంపికయ్యారు. టాప్ మోడల్ ఛాలెంజ్ రెండు రౌండ్లలో జరిగింది. నందిని భారతీయ సంస్కృతిని చాటిచెప్పి.. న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మిస్ వరల్డ్ వంటి ప్రతిష్టాత్మక పోటీలో భారతదేశం నుంచి టాప్ మోడల్ ఛాలెంజ్‌ను గెలుచుకోవడం గొప్ప గౌరవం. ఈ విజయం నందిని ఆత్మవిశ్వాసం, ఫ్యాషన్ సెన్స్, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది అంతర్జాతీయ ఫ్యాషన్, అందం పరిశ్రమలో భారతదేశం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ చిత్రం.. టైటిల్ ఏంటో తెలుసా?
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

