నాలుగు దేశాలను వణికిస్తున్న ‘వైట్ లంగ్’
అమెరికాలోని ఓహియోలో చిన్నారులు న్యుమోనియా వ్యాధి బారిన పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాక్టీరియల్ న్యుమోనియాకు సంబంధించిన ఈ కొత్త రకం ఇన్ఫెక్షన్ చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తున్నది.
న్యూఢిల్లీ : అమెరికాలోని ఓహియోలో చిన్నారులు న్యుమోనియా వ్యాధి బారిన పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. బ్యాక్టీరియల్ న్యుమోనియాకు సంబంధించిన ఈ కొత్త రకం ఇన్ఫెక్షన్ చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తున్నది. 3-8 ఏండ్ల మధ్య వయసు చిన్నారులకు ఈ వ్యాధి సోకుతున్నది. అయితే ఈ వ్యాధికి చైనాకు సంబంధం లేదని నిపుణులు చెప్పారు. బాధితుల ఊపిరితిత్తులను స్కాన్ చేసినపుడు తెలుపు రంగు మచ్చలు కనిపిస్తుండటంతో దీనిని వైట్ లంగ్ సిండ్రోమ్ అని పిలుస్తున్నారు. దగ్గు, తుమ్ములు, సంభాషణలు, ఊపిరి తీసుకుని, వదిలేటపుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి సోకుతున్నట్లు తెలుస్తున్నది. బాధితులు జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి, అలసట వంటివాటితో బాధపడుతూ ఉంటారు. ఓహియోలోని అధికారులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ బ్యాక్టీరియల్ న్యుమోనియా బాధితుల్లో చాలా మందికి యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల నయమైనట్లు తెలిపారు. చాలా మంది దవాఖానలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 'White Lung
- America
- Infection
- Ohio
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

