Sabrina Siddiqui: మోదీని ప్రశ్నించిన అమెరికా జర్నలిస్టుకు వేధింపులు..
Sabrina Siddiqui: బైడెన్‌తో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోదీని ప్రశ్నించిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధిక్‌కు ఆన్లైన్ వేధింపులు మొదలయ్యాయి. అయితే ఆ వేధింపులను వైట్‌హౌజ్ ఖండించింది. వేధింపుల గురించి తమకు నివేదికలు అందినట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి తెలిపారు.
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ అమెరికా టూర్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ బైడెన్‌తో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోదీ పాల్గొన్నారు. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన రిపోర్టర్ సబ్రినా సిద్ధిక్ (Sabrina Siddiqui).. భారత్‌లో ఉన్న ప్రజాస్వామ్యంపై మోదీని ప్రశ్నించారు. మోదీని క్వశ్చన్ చేసినందుకు రిపోర్టర్ సబ్రినాపై ఆన్లైన్లో వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు చాలా తీవ్రంగా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. సబ్రినాకు జరుగుతున్న వేధింపుల గురించి తమకు తెలుసు అని, ఆ వేధింపులను ఖండిస్తున్నట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి జాన్ కిర్బీ ఒక ప్రటకలో తెలిపారు. ఆ రిపోర్టర్ ముస్లిం మతస్థురాలు అని, ఆన్లైన్లో ఆమెపై సాగుతున్న వేధింపుల గురించి తమకు తెలుసు అని జాన్ వెల్లడించారు.
Prime Minister Modi completely destroyed the motivated question on steps being taken to ‘protect’ rights of Muslims and other minorities. In his response he didn’t mention Muslims or any other denomination, spoke about Constitution, access to Govt resources based on eligibility… pic.twitter.com/mPdXPMZaoI
— Amit Malviya (@amitmalviya) June 22, 2023
భారతీయుల నుంచి ఆన్లైన్ వేధింపుల వస్తున్న నేపథ్యంలో రిపోర్టర్ సబ్రినా తన ట్విట్టర్లో ఓ ఫోటో షేర్ చేసింది. టీమిండియా టీషర్ట్ వేసుకుని తన తండ్రితో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫోటో పెట్టింది. తన తండ్రి ఇండియాలో పుట్టినట్లు ఆమె తన ట్వీట్లో తెలిపింది. సిద్ధిక్ వేసిన ప్రశ్నకు బదులిస్తూ భారత్‌లో ఎటువంటి వివక్ష లేదని మోదీ అన్నారు.
Since some have chosen to make a point of my personal background, it feels only right to provide a fuller picture. Sometimes identities are more complex than they seem. pic.twitter.com/Huxbmm57q8
— Sabrina Siddiqui (@SabrinaSiddiqui) June 24, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

