CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
CJP Protest | పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే, అదే జంతర్‌మంతర్‌గా భావించి నిరసనలు కొనసాగించాలని సీజేపీ పిలుపునిచ్చింది. తాజా నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ అజింక్య షిండే ఈ మేరకు ఎక్స్‌లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. అయితే పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. (CJP Protest) ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే, అదే జంతర్‌మంతర్‌గా భావించి నిరసనలు కొనసాగించాలని సీజేపీ పిలుపునిచ్చింది. తాజా నిరసనలకు నేతృత్వం వహిస్తున్న సీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ అజింక్య షిండే ఈ మేరకు ఎక్స్‌లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. తమ నాయకులైన అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్‌లను ఢిల్లీ విమానాశ్రయంలో ప్రభుత్వం నిర్బంధించిందని ఆయన ఆరోపించారు. ప్రజా ఐక్యతకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.
కాగా, రవాణాపై ఆంక్షలు, నిరసన ప్రదర్శనకు వెళ్తున్న వారిని నిర్బంధించడం వంటివి ఈ సభను ఆపడానికేనని అజింక్య షిండే ఆరోపించారు. ‘పోలీసులు మిమ్మల్ని ఎక్కడ ఆపినా, మీరు మీ జంతర్ మంతర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసన స్థలం వైపు ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు.
మరోవైపు ఓటు హక్కును కోల్పోయిన ప్రజలకు ఆ హక్కును తిరిగి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టినట్లు అజింక్య షిండే తెలిపారు. ప్రభుత్వం విధించిన నిర్బంధాలు, ఆంక్షలు ఈ నిరసన పట్ల ప్రభుత్వానికి ఉన్న ఆందోళనకు సంకేతాలని అభివర్ణించారు. తాజా ఉద్యమం ఇప్పటికే కొంత పురోగతిని సాధించిందని అజింక్య షిండే తెలిపారు. ‘మోదీ, షాల భయం సూచన ద్వారా మేము ఈ పోరాటంలో సగం విజయం సాధించాం. ఒక కొత్త పోరాటానికి ఇది నాంది’ అని ఆయన అన్నారు.
అలాగే జంతర్ మంతర్ వద్ద గతంలో జరిగిన నిరసనలను ఈ సందర్భంగా అజింక్య షిండే గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అధికారాన్ని ప్రజల ఐక్యత సవాల్ చేసిందన్నారు.
We appeal to everyone to march towards Jantar Mantar!
If Delhi Police tries to stop you, wherever they stop you will become your Jantar Mantar.
@AjinkyaCJP https://t.co/W6BgstckVY
— Cockroach Janta Party – CJP (@Cockroachisback) October 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ajinkya Shinde
- Call
- CJP
- Crackdown
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

