పార్లమెంటులో చర్చలేవి?

- చట్టాలు చేస్తున్న తీరు విచారకరం
- వాటి ఉద్దేశమేంటో తెలియట్లేదు
- బిల్లులపై అసలు చర్చే జరగట్లేదు
- చట్టాల్లో లోపాలతో వివాదాలు
- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, ఆగస్టు 15: చట్టాల రూపకల్పనలో పార్లమెంటు ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతుండటం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులపై విస్తృత చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తి ప్రకటించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టు ఆవరణలో నిర్వహించిన జెండావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొని మాట్లాడారు. చట్టాలపై నిర్మాణాత్మక చర్చలు జరగకపోవడం వల్ల వాటిల్లో గందరగోళం, అస్పష్టత ఉంటున్నదన్నారు. ఫలితంగా కేసుల విచారణ సందర్భంలో కోర్టులు చట్టాలకు సరైన భాష్యం చెప్పడం ఇబ్బందిగా మారిందన్నారు. ‘బిల్లులపై చర్చ జరగకపోవడం, చట్టాల్లో అస్పష్టత కారణంగా వాటి అసలు ఉద్దేశం, లక్ష్యం ఏమిటన్నది కోర్టులు అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఇలాంటి చట్టాల వల్ల వివాదాలతో కోర్టులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతున్నది’ అని జస్టిస్ రమణ వాపోయారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై జరిగిన చర్చను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘పారిశ్రామిక వివాదాల చట్టంపై పార్లమెంటులో జరిగిన చర్చ నాకు ఇంకా గుర్తు ఉంది. ఆ చట్టం వల్ల కలిగే పరిణామాలు, శ్రామిక వర్గంపై దాన్ని ప్రభావాన్ని తమిళనాడు ఎంపీ రామ్మూర్తి చక్కగా వివరించారు. ఇలా చట్టాల ఉద్దేశం తెలిసినప్పుడు వాటిని విశ్లేషించడం కోర్టులకు సులువు అవుతుంది’ అని అన్నారు.
న్యాయవాదులు లేకపోవడం వల్లే
చట్టసభల్లో మేధావులు, న్యాయవాదులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు. గతంలో చట్టసభల్లో ఎక్కువగా న్యాయవాదులు ఉండేవారని, సభలు హుందాగా, ఫలప్రదంగా నడిచేవని తెలిపారు. తద్వారా చట్టాలను ఎందుకు రూపొందించారో కోర్టులకు స్పష్టత ఉండేదన్నారు. ఇటీవలి పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నప్పటికీ ఎలాంటి చర్చ లేకుండా 22 బిల్లులకు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.
లాయర్లు ప్రజాజీవితంలోకి వెళ్లాలి
దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపింది న్యాయవాదులే అని జస్టిస్ రమణ అన్నారు. మహాత్మా గాంధీ, జవహరలాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్ లాయర్లే అని గుర్తుచేశారు. న్యాయవాదులు కేవలం తమ వృత్తికే పరిమితం కావొద్దన్నారు. ప్రజాజీవితంలోకి వెళ్లాలని, సమాజ సేవ చేయాలని కోరారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్య హక్కులను ప్రజలకు అందేలా చూడటంలో కొన్నేండ్లుగా సుప్రీంకోర్టు కీలకపాత్ర పోషిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. చిన్నప్పుడు జెండా వందనం రోజులను జస్టిస్ రమణ ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. బెల్లం, పేలాలు ఇచ్చేవారని జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
Kajal Aggarwal | వెంట్రుకవాసిలో తప్పిన మృత్యువు.. 100 అడుగుల క్రేన్ కూలిన వేళ ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

