రాహుల్ నివాసంలో కీలక భేటీ.. డిసెంబర్లో కొత్త అధ్యక్షుడి ఎంపిక
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇంట్లో కాంగ్రెస్ కీలక నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్‌గఢ్ సీఎం బాఘేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సరళి, ఓటింగ్ శాతంతో పాటు ఫలితాల తర్వాత ఏర్పడే పరిస్థితులపై కూడా ఓ అంచనాకు వచ్చామని సీఎం భూపేశ్ బాఘేల్ తెలిపారు.
ఇక రాజస్థాన్ సీఎం గెహ్లోత్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించే విస్తృతంగా చర్చించామని తెలిపారు. దేశంలో ప్రతిపక్ష పార్టీ అంటే ఒక్క కాంగ్రెస్సేనని, ప్రజలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక… పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక డిసెంబర్ లో వుంటుందని పేర్కొంటున్నారు. డిసెంబర్ మాసంలో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, అప్పుడే కొత్త అధ్యక్ష ఎంపిక చేపట్టాలన్న నిర్ణయం కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.
ఇక ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఐదు రాష్ట్రాల కార్యకర్తలు, నేతలు అత్యంత అప్రమత్తతో ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ సూచించినట్లు సమాచారం. కౌంటింగ్ సెంటర్ల దగ్గర కార్యకర్తలు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పార్టీ బాధ్యులందరూ ఎప్పటికప్పుడు ఫలితాల సరళిని పర్యవేక్షిస్తూ ఉండాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

