వైరస్ సోకిన నెలలోపు చనిపోతే కరోనా మరణమే

- దవాఖానలో మరణిస్తే నెల దాటినా కూడా…
- ‘పాజిటివ్’ ఉండి సూసైడ్ చేసుకొంటే కాదు
- కరోనా డెత్ సర్టిఫికెట్లకు మార్గదర్శకాలు
- సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ సమర్పణ
న్యూఢిల్లీ: కరోనా మృతుల డెత్ సర్టిఫికెట్ల జారీపై కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా కొత్తగా మార్గదర్శకాలు జారీచేసినట్టు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా మృతుల డెత్ సర్టిఫికెట్లలో మరణానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనడం లేదని, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ కూడా సంక్లిష్టంగా ఉందని.. ఫలితంగా బాధితులు పరిహారం పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను సులభతరం చేయాలని, మరణానికి గల కారణాలను సర్టిఫికెట్లలో స్పష్టంగా పేర్కొనాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 11లోగా కొత్త మార్గదర్శకాలు జారీచేయాలని గతంలో సూచించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు శనివారం అఫిడవిట్ సమర్పించింది. ఈ నెల 3నే మార్గదర్శకాలను జారీచేసినట్టు అందులో పేర్కొన్నది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం…
- కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో వ్యక్తి ఎప్పుడు చనిపోయినా కొవిడ్ మరణంగా పరిగణిస్తారు. రోగి దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోతేనే కరోనా మృతుడిగా పరిగణించాలన్న నిబంధనేం లేదు. రోగి దవాఖానలో చికిత్స పొందుతూ 30 రోజులు దాటాక మరణించినా అది కరోనా మరణమే.
- ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్ పరీక్ష, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష లేదా దవాఖానల్లో వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కొవిడ్ నిర్ధారణకు ప్రామాణికమే.
- కొవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నా, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినా అది కొవిడ్ మరణంకాదు.
- మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న కారణాలపై మృతుల కుటుంబసభ్యులు ఏవైనా ఫిర్యాదు చేస్తే 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఇందుకోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

