Admit Card | దరఖాస్తు చేసిన ఏడేండ్లకు అడ్మిట్‌కార్డు.. విస్తుపోయిన అభ్యర్థి
వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది.
కోల్‌కతా: వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా.. నోటిఫికేషన్ వచ్చింది, అతడు దరఖాస్తు చేసుకుంది 2016లో.. అడ్మిట్‌కార్డు అంతనికి అందింది 2023లో.. అంటే ఏడేండ్ల తర్వాత అన్నమాట. ఈ ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది.
2016 మార్చి నెలలో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ (Ashish Banerjee) అని అభ్యర్థి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నియామక పరీక్ష అదే ఏడాది డిసెంబర్లో జరిగింది. అయితే హాల్‌టికెట్ రాకపోవడంతో అతడు పరీక్షకు హాజరుకాలేకపోయాడు.
అయితే ఈ నెల 1న అతనికి ఓ మెయిల్ ఓ వచ్చింది. అదిచూసి అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తీరా దానిని ఓపెన్ చేసి చూడగా ఏడేండ్ల కింద తాను దరఖాస్తు చేసిన అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన అడ్మిట్‌కార్డు. ఇన్నేండ్ల తర్వాత హాల్‌టికెట్ రావడంతో షాక్ అయిన అతడు.. అసహనానికి లోనయ్యాడు. ఈ ఆలస్యానికి కారణం ఎవరు, అది ఇప్పుడు ఎందుకు వచ్చిందనే విషయమై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

