మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య డిశ్చార్జ్..

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి మీరా భట్టాచార్య ఇవాళ కోల్‌కతాలోని నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరూ కోవిడ్ సంబంధిత రుగ్మతలకు చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ మాజీ సీఎం భట్టాచార్య డిశ్చార్జీ అయినట్లు డాక్టర్లు వెల్లడించారు. గత నెల 25వ తేదీన కోవిడ్ వల్ల బుద్దదేవ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నా తక్కువ నమోదు కావడంతో ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. 77 ఏళ్ల భట్టాచార్యకు మే నెలలో కరోనా వైరస్ సంక్రమించింది. మొదట ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించారు. కానీ ఆక్సిజన్ లెవల్స్ డౌన్ కావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. బెంగాల్ రాజకీయాల్లో సీపీఎం సీనియర్ నేతగా భట్టాచార్య ఎంతో ప్రఖ్యాతి గాంచారు. అయితే గత దశాబ్ధ కాలం నుంచి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ నుంచి ఆయన బాధపడుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో కూడా భట్టాచార్యకు హాస్పిటల్లో చికిత్స అందించారు. అప్పుడు ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. 13 మంది సభ్యుల మెడికల్ బోర్డు ఆయనకు చికిత్స అందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

