బిల్లుల పెండింగ్‌పై జవాబివ్వండి
పశ్చిమబెంగాల్, కేరళలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది.
- పశ్చిమబెంగాల్, కేరళ రాష్ర్టాల గవర్నర్ల కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు
- కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా తాఖీదులు
- అసెంబ్లీలో పాసైన బిల్లులను గవర్నర్లు నిలుపుదల చేయడంపై పిటిషన్లు
న్యూఢిల్లీ, జూలై 26: పశ్చిమబెంగాల్, కేరళలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు పెండింగ్‌లో ఉంచడంపై ఆయా రాష్ర్టాల్లోని టీఎంసీ, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం పరిగణనలోకి తీసుకొన్నది. మూడు వారాల్లోగా పిటిషన్లపై స్పందన తెలియజేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పశ్చిమబెంగాల్, కేరళ గవర్నర్ల కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. పిటిషన్లో కేంద్ర హోంశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
రెండేండ్లుగా పెండింగ్‌లో..
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కొన్ని బిల్లులను రాష్ట్రపతి ముర్ముకు కూడా సిఫారసు చేశారని, అవి కూడా ఇంకా ఆమోదం పొందలేదని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పేర్కొన్నది. ఏడు బిల్లుల్లో ఒక్కదానికి కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలతో సంబంధం లేదని తెలిపింది. ఈ బిల్లులను గవర్నర్ రెండేండ్లుగా పెండింగ్‌లో ఉంచారని, ఇలాంటి చర్యలు రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలను దెబ్బతీస్తాయని, అసమర్థంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయని తెలిపింది. ఎల్డీఎఫ్ సర్కార్ సుప్రీంకోర్టులో మార్చిలో పిటిషన్ వేసింది.
కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ‘ఇది చాలా దురదృష్టకర పరిస్థితి’ అని అన్నారు. గవర్నర్ చాలా కాలంగా బిల్లులను పెండింగ్‌లో ఉంచారని, బిల్లును ఆమోదించకుండా నిలుపుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఏ పరిస్థితిలో తిప్పి పంపాలి? లేదా రాష్ట్రపతికి సిఫారసు చేయాలి? అనే దానిపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు.
కారణం చెప్పకుండా నిలుపుదల
తమ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలపకుండా నిలిపివేశారని టీఎంసీ సర్కార్ కోర్టుకు తెలిపింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి తమిళనాడు వంటి రాష్ర్టాల్లో జరిగిన పలు పరిణామాలను వివరించారు. సుప్రీంకోర్టు కేసులను విచారణకు తీసుకోగానే.. కొన్ని బిల్లులను ఆమోదించడమో లేదా రాష్ట్రపతికి సిఫారసు చేయడమో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎలాంటి కారణం చెప్పకుండా నిలుపుదల చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 200కు విరుద్ధమని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

