గురువారం 04 జూన్ 2020
National - May 10, 2020 , 20:34:26

ఈద్ కు లాక్ డౌన్ తీసేయొద్ద‌ని లేఖ రాస్తాం..

ఈద్ కు లాక్ డౌన్ తీసేయొద్ద‌ని లేఖ రాస్తాం..

కోల్ క‌తా: రంజాన్ సంద‌ర్బంగా రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేయొద్ద‌ని సీఎం మమ‌తాబెన‌ర్జీని కోరుతామ‌ని బెంగాల్ ఇమామ్స్ అసోసియేష‌న్ ఛైర్మ‌న్ ఎండీ య‌హియా అన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..ఈద్ కు లాక్ డౌన్ తీసెయొద్ద‌ని సీఎంకు లేఖ రాస్తాం.

ఈద్ కార‌ణంగా లాక్ డౌన్ తీసేస్తే వంద‌లాది మంది ప్ర‌జ‌లు వీధుల్లో గుమిగూడుతారు. త‌ద్వారా క‌రోనా కేసులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంది. మేం పండుగ‌ను త‌ర్వాత సెల‌బ్రేట్ చేసుకుంటాం. ప్ర‌జ‌లు సుర‌క్షితంగా ఉండ‌ట‌మే ప్ర‌స్తుతం చాలా ముఖ్య‌మ‌ని య‌హియా అన్నారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo